బిగ్ బాస్ మరో ట్విస్ట్.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందా?
on Nov 29, 2022
బిగ్ బాస్ లో గతవారం అంతా ఫ్యామిలీ వీక్ తో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ తో ముందుకు వస్తోందా? అంటే అవుననే చెప్పాలి. బిగ్ బాస్ ఈ సీజన్ ముగియడానికి ఇంకా మూడు వారాలే ఉండటంతో ఎవరు టాప్ ఫైవ్? ఎవరు విన్నర్? తర్వాత ఎవరు ఎలిమినేట్? ఇలా చాలా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా బిగ్ బాస్, ఈ వారం పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా, సీజన్ ముగియడానికి ఇంకా మూడు వారాలే ఉండడంతో.. ఈ రెండు వారాల్లో ముగ్గురిని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఫినాలే వీక్ కి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని ఉంచాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే బిగ్ బాస్ చరిత్రలోనే 'మిడ్ వీక్ ఎలిమినేషన్' అనేది మొదటి సారి. కాగా మిడ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు సస్పెన్స్ లాగా మారింది. కానీ గతవారం పోలింగ్ చూస్తే ఫైమా, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు వెళ్ళే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే ప్రతి ఆదివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్, ఈ వారం మాత్రం మధ్యలోనే ఎలిమినేట్ అవ్వడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. కాగా మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శని, ఆదివారాలలో నాగార్జున ని కలిసే అవకాశం ఉండదు. ఇంకా తన జర్నీ వీడియోని చూసే అవకాశం కూడా ఉండదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read